1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన

1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన

హైదరాబాద్: GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని చేసినా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిందని కాంట్రాక్టర్లు చెప్పారు. ఏడాదిన్నర కాలంలోరూ. 1350 కోట్ల  బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే బకాయిలు చెల్లించకపోతే అన్ని పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

మా జీవనాధారమే ఇది.. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశాం.పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అప్పల భారంతోపాటు జీవనం కష్టంగా మారిందంటున్నారు. కనీసం పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో దాదాపు 2వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నారు.. వారికి రావాల్సిన బిల్స్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.