పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన

పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల  నిరసన

హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కాప్రా జీహెచ్ఎంసి ఆఫీస్ ముందు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నో పేమెంట్ నో వర్క్ అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు.  8 నెలలుగా కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుని.. ఇప్పటికీ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాప్రా కాంట్రాక్టర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ లోనూ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని.. ధర్నాలు చేస్తేనే బిల్లులు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం కూడా 8 నెలలు కావస్తున్న సిటీలోని మొత్తం కాంట్రాక్టర్లకు సుమారు 550 కోట్ల బిల్లులు ఆపివేశారని తెలిపారు. జీహెచ్ఎంసి అధికారులు వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు కాంట్రాక్టర్స్.