Good Health: గంధం ఆయిల్​.. అందమే కాదు.. ఆరోగ్యం కూడా..షుగర్​ కంట్రోల్​.. బీపీ తగ్గుతుంది... బోలెడు ఉపయోగాలు

Good Health:  గంధం ఆయిల్​.. అందమే కాదు.. ఆరోగ్యం కూడా..షుగర్​ కంట్రోల్​.. బీపీ తగ్గుతుంది... బోలెడు ఉపయోగాలు

అత్యంత సువాసనగల నూనెలలో గంధపు నూనె ఒకటి. శతాబ్దాలుగా ఆయుర్వేద, చైనీస్ ఔషధాలలో ప్రధాన పదార్ధంగా ఉంది. అయితే ఇది అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు నిపుణులు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైటెక్​ యుగంలో అందంగా కనపడాలని జనాలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. రక రకాల పౌడర్లు.. వెరైటీ వైరైటీ స్కిన్​క్రీములు .. మాయిశ్చరైజ్​ లు వాడుతున్నారు.  పూర్వకాలంలో ఆరు పదులు దాటినా కాని ముఖంపై ముడతలు  వచ్చేవి కావు.. కాని ప్రజంట్​ యూత్​ రెండు పదుల వయస్సు వచ్చిందంటే చర్మం ముడతలు పడి ఫంక్షన్లకు వెళ్లాలంటే మేకప్​ లేకుండా వెళ్లలేకపోతున్నారు.  కని గంధం ఆయిల్​ రాసుకుంటే ఎలాంటి మేకప్​ అవసరం లేదంటున్నారు నిపుణులు. 

చర్మ సంరక్షణ, అందం..  ఆరోగ్యానికి గంధం  ఎంత ఉపయోగపడుతుందని  చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, డెర్మటాలజీ, వెనెరియాలజీ ..  లెప్రాలజీ విభాగం చేసిన పరిశోధనలో తేలింది.  గంధం ఆయిల్​లో ... యాంటీ ఇన్‌ఫ్లమేటరీ...  యాంటీమైక్రోబయల్ .. సంభావ్య క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH)  తెలిపింది. 

 శాండిల్​ ఆయిల్​ ఉపయోగాలు: గంధపు నూనె చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు ఉపశమనం కలిగిస్తుంది, ఎరుపు మరియు చికాకును తగ్గిస్తుంది .. చర్మానికి  హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఇది పొడి మచ్చలను తగ్గించడంలో, పగుళ్లను నివారించడంలో మరియు మీ చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ నూనెను మసాజ్‌లో కూడా ఉపయోగిస్తారు. గంధపు నూనె యొక్క ప్రశాంతమైన వాసన మంచి నిద్రను..  ఒత్తిడిని తగ్గించడం...   అంతే కాకుండా ఈ రోజుల్లో జనాలు ఇబ్బంది పడే బ్లడ్​ షుగర్​ను కంట్రోల్​ చేస్తుందని  పరిశోధకులు చెబుతున్నారు.

వేడిని తగ్గిస్తుంది: శరీరంలో వేడి ఎక్కువైతే అనేక రకాలైన చర్మ సమస్యలు వస్తాయి.  గంధంపేస్ట్​ లో చల్లగా ఉండే లక్షణం ఉంటుంది.  ఈ చర్మంపై ఈ పేస్ట్​ రాస్తే చర్మ సమస్యలను తగ్గింస్తుంది. ఇది మంట ..  చర్మం ఎరుపును తగ్గించడమే కాకుండా  చర్మాన్ని సౌందర్యంగా ఉంచుతుంది.

మనస్సు  ప్రశాంతంగా ఉండాలంటే.. :  గంధం నూనెలోని వెచ్చని, రిఫ్రెష్ సువాసన మీ మనస్సును శాంతింపజేయడంలో సహాయపడి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రిలాక్సింగ్, ప్రశాంతత ఇవ్వడంలో గంధపు నూనె ప్రసిద్ధి చెందింది. నూనెలోని చెక్క, వెచ్చని, రిఫ్రెష్ సువాసన మీ మనస్సును శాంతింపజేయడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.అరోమాథెరపీలో నిద్రరావడానికి ఉపయోగిస్తారు.

ALSO READ | Health Tips: నోట్లో నుంచి భయంకరమైన వాసన వస్తుందా.. కీరాతో చెక్​ పెట్టండి

వాపును తగ్గిస్తుంది: గంధపు నూనె యాంటీ ఏజింగ్ ఆయిల్ గా చాలా బాగా పని చేస్తుంది. గంధపుచెట్టు నుండి గంధపు నూనెను తయారు చేస్తారు. గంధపు చెక్కల నుండి తయారయ్యే ఈ సుగంధ భరితమైన గంధపు నూనె వాపునఉ తగ్గిస్తుంది.  శాండిల్​ ఆయిల్​ లో    ఆల్ఫా-శాంటలోల్ అనే పదార్థం  వాపును తగ్గిస్తుంది. ఇది సోరియాసిస్ తగ్గిస్తుంది.

క్యాన్సర్ పోరాట లక్షణాలు: ఆల్ఫా-శాంటలోల్ క్యాన్సర్ కణాల పెరుగుదలనును నియంత్రిస్తుంది. నోటి, రొమ్ము, ప్రోస్టేట్ , చర్మ క్యాన్సర్‌లకు  ఈ ఆయిల్​ మంచి ఔషధమని పరిశోధకులు చెబుతున్నారు.

 బీపీని తగ్గిస్తుంది: గంధపు నూనెలో ఉండే హైపోటెన్సివ్ ఏజెంట్ మీ సిస్టోలిక్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గంధం నూనెను పాలలో కలుపుకొని తాగాలి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గంధపు నూనెలో ఉండే ఒక నిర్దిష్ట రకమైన తేలికపాటి ఉపశమన గ్యాంగ్లియోనిక్ బ్లాకర్స్ లేదా హైపోటెన్సివ్ ఏజెంట్లు మీ రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. 

చర్మానికి మంచిది: గంధపు చెక్క యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది .  చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. ఇది శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది.గంధపు నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ చర్మానికి ఉపశమనం ఇస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మచ్చలు, ముడతలు, గీతలు, మచ్చలు, నల్లని మచ్చల రాకుండా పోరాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. ఇది స్కిన్ టానింగ్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.

బ్లడ్​ షుగర్​..  కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది: గంధం ఆయిల్​ లో ఉండే  యాంటీ-హైపర్గ్లైసీమిక్ (రక్తంలో చక్కెరను తగ్గించే) ప్రభావాలను కలిగి ఉంటుంది.  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని కూడా  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధిని కంట్రోల్​ చేసి .. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి శాండిల్​ వుడ్​ ఆయిల్​  ఉపయోగపడుతుంది.

మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: గంధం మెదడు పనితీరు..  మానసిక స్థితి నియంత్రణను మెరుగుపరుస్తుందని  పలు అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఇది  మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను సమతుల్యం చేస్తుంది.