భోపాల్‌‌‌లో కంట్రోల్‌‌‌‌ఎస్‌‌‌‌ డేటా సెంటర్‌: పెట్టుబడి రూ.500 కోట్లు

భోపాల్‌‌‌లో కంట్రోల్‌‌‌‌ఎస్‌‌‌‌ డేటా సెంటర్‌: పెట్టుబడి రూ.500 కోట్లు

న్యూఢిల్లీ: కంట్రోల్‌‌‌‌ఎస్‌‌‌‌  డేటాసెంటర్స్ భోపాల్‌‌‌‌లో ఒక గ్రీన్‌‌‌‌ఫీల్డ్ డేటా సెంటర్ కోసం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఫెసిలిటీ   శంకుస్థాపన తాజాగా జరిగింది.  ఈ ఈవెంట్‌‌‌‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్నారు. “బద్వాయ్ ఐటీ పార్క్‌‌‌‌లో  మధ్యప్రదేశ్ ప్రభుత్వం  కేటాయించిన 5 ఎకరాల భూమిపై తాజా ఫెసిలిటీని నిర్మిస్తాం. ఇందుకోసం  రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాం.  సుమారు 200 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది’’ అని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా ప్రాసెసింగ్ అప్లికేషన్‌‌‌‌లకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలోని  డిజిటల్ ఎకోసిస్టమ్‌‌‌‌ను బలోపేతం చేస్తామని తెలిపింది.