ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించాలి

ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ డీసీపీలు

ఖమ్మం టౌన్,వెలుగు : జిల్లాలో గంజాయి సరఫరాను, వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని  అడిషనల్ డీసీపీ లు నరేశ్​కుమార్,  ప్రసాద్ రావు పోలీస్ అధికారులకు ఆదేశించారు.  సోమవారం  సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కల్పించాలని  అన్నారు. గ్రామాల్లో   ర్యాలీలు, సదస్సులు నిర్వహించి   అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.  

సైబర్‌ నేరగాళ్ల బారిన  పడ్డ ఎవరైనా..  1930,  cybercrime.gov.inలో ఫిర్యాదుచేయాలన్నారు.   జిల్లావ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇప్పటికే జిల్లాలో గుర్తించిన 68 బ్లాక్‌ స్పాట్స్‌ను ఆయా శాఖల వారిగా బ్లాక్‌ స్పాట్లలో బ్యారికేడింగ్‌, స్టాపర్స్‌, సిగ్నల్‌ లైట్స్‌, బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు  చేయాలని ఆదేశించారు.