డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ​పీజీ ఎగ్జామ్స్​ వాయిదా

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఎగ్జామ్స్​వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్​ ఆఫ్​ఎగ్జామినేషన్ (సీవోఈ) అరుణ శుక్రవారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. కామన్​ పోస్ట్​గ్రాడ్యుయేట్​ఎంట్రన్స్​టెస్ట్​(సీపీజీఈటీ) కారణంగా ఎగ్జామ్స్​వాయిదా వేసినట్లు తెలిపారు. 

డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల ఎగ్జామ్స్​, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్​లాగ్​ఎగ్జామ్స్​ జూలై 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఇంటిగ్రేటెడ్​ పీజీ ఎగ్జామ్స్​ డేట్​లను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. స్టూడెంట్స్​ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాల కోసం టీయూ వెబ్​సైట్​చూడాలని తెలిపారు.