పంజాబ్ అధికారులతో భేటీ.. వివాదంలో కేజ్రీవాల్..

ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేకుండానే ఈ సమావేశం జరగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకుపడుతున్నాయి. పంజాబ్ లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ, విద్యుత్ శాఖ సెక్రటరీ సైతం పాల్గొన్నారు. 

సీఎం భగవంత్ మాన్ లేకుండా అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం కావడంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పీసీసీ మాజీ చీఫ్ సిద్ధూ ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ పై మండిపడ్డారు. సీఎం లేని సమయంలో కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారులతో సమావేశమవడాన్ని బట్టి అరవింద్ డీఫ్యాక్టో సీఎం, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ అని తేలిపోయిందని అన్నారు. కేజ్రీవాల్ ఫెడరలిజాన్ని అవమానించారని, దీనిపై పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ ఇద్దరూ వివరణ ఇవ్వాలని సిద్ధూ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

రెస్క్యూ ఆపరేషన్లో మరో అపశృతి.. మహిళ మృతి..

కేసీఆరే రైతుల మెడ మీద కత్తి పెడ్తుండు