వివాదాస్పద ట్రైనీ ఐఎఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

వివాదాస్పద ట్రైనీ ఐఎఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఖేడ్కా వివాదాల కేంద్రంగా మారింది. దీంతోపాటు ఐఏఎస్ ఉద్యోగం సంపాదిం చేందుకు ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. నేరం రుజువైతే ఆమెను సర్వీస్ నుంచి తొలగించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన విధానం, సర్వీస్ ఎంపిక సమయంలో ఆమె సమర్పించిన అర్హత ధృవీకరణ పత్రాలను మరోసార కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ పరిశీలిస్తుందని అధికారు తెలిపారు.  దోషిగా తేలితే సర్వీస్ నుంచి తొలగించడంతోపాటు ఆమె క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. 

Also Read:కొత్త కారు కొన్న చరణ్..ఇండియాలోనే రెండోది..ధరెంతో తెలుసా?

34 ఏళ్ల పూజా ఖేడ్కర్ ఇటీవల ఫుణె అదనపు కలెక్టర్ గా పనిచేస్తూ .. వివాదంలో ఇరుక్కొని విదర్భ ప్రాంతంలో వాషిమ్ జిల్లా కలెక్టరేట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా గురువారం (జూలై 11) బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన పరమైన సమస్యలు తలెత్తకుండా పూజా ఖేడ్కర్ వేరేచోటికి బదిలీ చేయాలని పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దివాసే ఫిర్యాదుతో పూజా ఖేడ్కర్ ను వాషిమ్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. 

ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌

ఐఏఎస్‌ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్‌ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా పూజా ఖేడ్కర్‌ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. 

పూజా ఖేడ్కర్ వివాదం ఏంటీ 

ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ నియామకం జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ఆమెపై వచ్చిన ఆరోపణలు, వివాదంపై విచారణ జరిపించేందుకు కేంద్రం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. నివేదికను త్వరలో సెంట్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (CAT) కు సమర్పించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పూజా ఖేడ్కర్ దృష్టిలోపం, మానిసక అనారోగ్యం ఉన్నట్లు తెలిపింది. ఆమెకు తక్కువ మార్కులు వచ్చినా ఈ రాయితీలతో ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించింది. 

ఉద్యోగంలో చేరిన నాటినుంచి ఆమె ప్రవర్తనా తీరుపై UPSC సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (CAT)లో సవాల్ చేసింది. ఈ వివాదంపై ఫిబ్రవరి 23, 2023లో CAT ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే పూజా ఖేడ్కర్ సమర్పించిన MRI సర్టిఫికెట్ ను తరవాత ఆమోదించారు. దీంతో ఆమె IAS అధికారిగా నియమించబడింది. 

Also Read:-ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ముగ్గురు అరెస్ట్.. ఎందుకో తెలుసా?

ఇదిలా ఉంటే పూజా ఖేడ్కర్ తన హోదాలో లేని ప్రత్యేక అధికారాలను కలెక్టర్ కార్యాలయం నుంచి కోరారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె అధికార దుర్వినియోగం ఆరోపణతో పుణె నుంచి వాషిమ్ కు బదిలీ చేశారు. ఈ వివాదంతో పూజా ఖేడ్కర్ జాతీయ స్థాయిలో అందరి నోటా పడ్డారు.