బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన వివాదాస్పదంగా మారింది. జగిత్యాల పట్టణంలోని నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కోటాలో ఆలయ నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తానని కవిత ప్రకటించారు.
విగ్రహ నిర్వాహకులు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కవిత ఈ ప్రకటన చేసినట్లు జిల్లా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read :- ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ట్విస్ట్
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న డబ్బు,బంగారాన్ని తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకుంటున్నారు.