దుద్దిళ్ల Vs వేముల: అసెంబ్లీలో లిక్కర్ లొల్లి

దుద్దిళ్ల Vs వేముల: అసెంబ్లీలో లిక్కర్ లొల్లి

 = ‘‘బెల్టు’ తీయాలన్న ప్రశాంత్ రెడ్డి
= ఆదాయం కోసం అడ్డగోలుగా లిక్కర్ ధరలు పెంచుతుండ్రు
= కొత్త మద్యం పాలసీ విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్
= మీరు రేషన్ షాపుల్లోనూ లిక్కర్ అమ్మిండ్రన్న మంత్రి శ్రీధర్ బాబు
= బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయబోమని క్లారిటీ
= పరిపాలన సంస్కరణలతో ఆదాయం పెంచుకుంటామని స్పష్టం 

హైదరాబాద్: కొత్త మద్యం పాలసీ, బెల్టు షాపుల నిర్వహణపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర  ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచుతోందని, కొత్త మద్యం పాలసీని వెంటనే విత్ డ్రా చేసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం.. కొత్త బ్రాండ్లు.. కొత్త బీర్లు, కొత్త బార్లు, కొత్త పబ్‎లు  ఇదేనా ప్రభుత్వ పాలసీ అని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులు తీసేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ మార్గాన్ని పెంచేందుకు బెల్టు షాపులను పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కౌంటర్​ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే అడ్డగోలుగా.. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు జరిపారని ఫైర్​అయ్యారు. ఆఖరికి రేషన్షాపుల్లో కూడా లిక్కర్​ సేల్స్‎కు  పర్మిషన్ ఇచ్చిన చరిత్ర  బీఆర్ఎస్‎కు ఉందన్నారు. బెల్టుషాపులపై వారు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని సెటైర్​వేశారు.

ALSO READ | వివేక్ అన్న.. కంగ్రాట్స్..! శుభాకాంక్షలు చెప్పిన మల్లారెడ్డి

‘బెల్టు షాపులు తామే తెచ్చామని ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోవడం సంతోషకరం. బెల్టు షాపులు మేం పెంచలేదు. అలాంటివి మేం ఎంకరేజ్ చెయ్యబోం.  ప్రభుత్వంలో లీకేజెస్ ఉండొద్దు అనే ఆదాయం పెంచుతామన్నం. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యాంగ చౌక షాపుల్లో  మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖలో  లీకేజెస్ లేకుండా సర్కార్ చేపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో రీఫామ్ తెస్తాం. దీని వల్ల రెవెన్యూ పెంచుకుంటాం’ అని శ్రీధర్​బాబు తెలిపారు.