
- ఈ నెల 7న సీపీ అంబర్కిశోర్ఝా ట్రాన్స్ఫర్ఆ
- యన రిలీవ్అయిన 9వ తేదీన 40 మంది బదిలీ
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పోలీస్సిబ్బంది బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కమిషనరేట్ లోని వివిధ స్టేషన్లలో పని చేస్తున్న 33 మంది పీసీలు, ముగ్గురు హెడ్కానిస్టేబుళ్లు, నలుగురు ఏఎస్సైలు మొత్తంగా 40 మంది రెండు విడతల్లో ఒకేరోజు బదిలీ కాగా, ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండానే బదిలీలు చేశారంటూ ట్రాన్స్ఫర్స్కోసం ఎదురుచూస్తున్న కొందరు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ నెల 7న సీపీ అంబర్కిశోర్ఝాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన 9వ తేదీన వరంగల్ నుంచి రిలీవ్అయ్యారు. ఆయన రిలీవ్అయిన 9వ తేదీన ఈ 40 మంది సిబ్బందిని బదిలీ చేసినట్టు ట్రాన్స్ఫర్స్ఆర్డర్స్ కాపీలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత బదిలీ అయిన సిబ్బంది ఆయా స్టేషన్ల నుంచి రిలీవ్అయినట్లు తెలిసింది.
కాగా, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్కాపీలు సోషల్మీడియాకెక్కగా, బదిలీల వ్యవహారంపై పోలీస్వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదిలాఉంటే ట్రాన్స్ఫర్ అయిన 40 మందిలో ఐదుగురు మినహా మిగతా వాళ్లంతా సెంట్రల్ జోన్పరిధిలో పోస్టింగ్దక్కించుకోవడం గమనార్హం. దీంతో ట్రాన్స్ఫర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్ సీపీగా ఇటీవల ఛార్జ్తీసుకున్న సన్ ప్రీత్ సింగ్ ను వివరణ కోరగా, ఈ విషయం ఇంతవరకూ తన దృష్టికి రాలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.