గవర్నమెంట్​ స్కూళ్లను నిర్వీర్యం చేసిన్రు

మరికల్/నాగర్​కర్నూల్​టౌన్/ఆమనగల్లు, వెలుగు: సర్కారు బడులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏబీవీపీ హాస్టల్​ విభాగ్​ రాష్ట్ర కన్వీనర్​ నవీన్​రెడ్డి ఆరోపించారు. సోమవారం మరికల్, ధన్వాడ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల బంద్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సౌలతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్, కురుమూర్తి, శివ కార్తీక్, భానుప్రసాద్, అనిల్, శివ పాల్గొన్నారు. 

ALSOREAD:కొత్త మండలంగా బండలింగాపూర్

నాగర్ కర్నూల్  పట్టణంలో స్కూళ్లను ఏబీవీపీ నాయకులు బంద్​ చేయించారు. ప్రభుత్వ విధానాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ఏబీవీపీ నగర కార్యదర్శి కార్తీక్, చరణ్, సాయి, జయపాల్, శివ పాల్గొన్నారు. ఆమనగల్లు, కడ్తల్, తలకొండపల్లి మండలాల్లో స్కూల్స్​ బంద్​ సక్సెస్​ అయింది. భరత్, మల్లేశ్, మురళి, శ్రీకాంత్  పాల్గొన్నారు.