
- రెండున్నర క్వింటాళ్లు అనాథలకు అందజేత
కోడేరు,వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు , తాతలకు, అవ్వలకు తమ వంతు సహాయం చేయాలని సోమవారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామ చందు కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలిసి ప్రతీ ఇంటి నుంచి పిడికెడు బియ్యం సేకరించారు.
ఇలా సేకరించిన రెండున్నర క్వింటాళ్ల బియ్యాన్ని అనాథాశ్రమంలో అందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాంట్ కే.సరోజినీ దేవి, ఉపాధ్యాయులు గణపతి, హుస్సేన్, నరసింహ, సమీరా, రాణి, అనిత, మేరీ పాల్గొన్నారు.