సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా? అయితే వాట్సాప్ గ్రూపులను సిగ్నల్ యాప్‌కు ఇలా మార్చుకోండి..

వాట్సాప్ యాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ యూజర్లకు కొత్త కష్టాలను తెస్తోంది. ఇప్పటికే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి వివరణ ఇచ్చినా.. చాలామంది మాత్రం వాట్సాప్ నుంచి మరో యాప్‌కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ప్రత్యామ్నాయంగా టెలీగ్రామ్ యాప్‌పై ఆసక్తి చూపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం సిగ్నల్ యాప్‌కు మారడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం గమనార్హం.

వాట్సాప్‌కు గట్టి పోటీ ఇచ్చే యాప్‌గా సిగ్నల్ యాప్ పేరు వినిపిస్తూ ఉండటంతో ఎక్కువమంది యూజర్లు ఈ యాప్‌పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే సిగ్నల్ యాప్ కొత్తది కావడంతో చాలామంది యూజర్లను అనేక సందేహాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల మాదిరిగా సిగ్నల్ యాప్‌లో కూడా గ్రూపులను క్రియేట్ చేసుకోవడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందేహం చాలామందికి వస్తోంది.
ఎవరైతే వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనలకు అంగీకరించరో వారి వాట్సాప్ వచ్చే నెల 8వ తేదీ నుంచి పని చేయదు.

ఒక కొత్త ఆప్షన్ సహాయంతో ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు సిగ్నల్ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. సిగ్నల్ యాప్‌లోకి వాట్సాప్ గ్రూపులను మార్చుకోవడానికి మొదట సిగ్నల్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత గ్రూప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గ్రూప్ లింక్ టర్న్ చేయాలి. ఆ తరువాత షేర్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి వాట్సాప్ గ్రూపులకు లింక్‌లను షేర్ చేయాలి. ఆ ఇన్వైట్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ యూజర్లు సులభంగా సిగ్నల్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజర్లకు కొత్త ప్రైవసీ పాలసీ ఇబ్బందులు తెస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ పాలసీ విషయంలో వెనక్కు తగ్గుతుందేమో చూడాల్సి ఉంది.

For More News..

ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. మురికిగుంటలో శవమై తేలాడు

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే