Viral video: చేసిందే ఘోరమైన తప్పు..పైగా న్యాయవాదిపై దాడినా..?

Viral video: చేసిందే ఘోరమైన తప్పు..పైగా  న్యాయవాదిపై దాడినా..?

ఆమె ఓ హత్య కేసులో దోషి..జీవిత ఖైదు అనుభవిస్తున్న హంతకురాలు..అయినా తీరు మారలే.. భర్తను దారుణంగా చంపిన హత్య కేసు విచారణలో న్యాయవాదిపై తీవ్రంగా దాడి చేసింది. అమెరికాలోని విస్కాన్ సిన్ కోర్టు గదిలో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

టేలర్ షాబిజినెస్..2022లో భర్త షాద్ థైరియన్ ను దారుణంగా హత్య చేసింది. తల నరికి అతని తల్లి ఇంటి ముందు చెత్తబుట్టలో వేసింది..అప్పట్లో ఈ కేసు సంచలన సృష్టించింది. విచారణ చేపట్టిన కోర్టు టేలర్ ను దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆ సమయంలో న్యాయవాదిపై దారుణంగా దాడి చేసింది. ఇంతకుముందు జైలు సిబ్బందిపై కూడా దాడి చేసినట్లు అధికారులు వివరాల ప్రకారం తెలుస్తోంది.  

27యేళ్ల టేలర్ తైచీదా కరెక్షనల్ ఇన్ స్టిట్యూషన్ లో జైలు గార్డుపై దాడి చేసిన ఆరోపణలతో శుక్రవారం (ఏప్రిల్4) కోర్టులో హాజరపర్చారు. విచారణ జరుగుతుండగానే ఒక్కసారిగా లేచి లాయర్ పైపడి పిడిగుద్దులతో విరుచుకుపడిన దృశ్యాలు కోర్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కోర్టు సమయంలో లాయర్లపై టేలర్ దాడి చేయడం రెండోసారి అని అధికారులు చెబుతున్నారు.