Cricket World Cup 2023: ఇంగ్లాండ్‌ని చితకొట్టిన న్యూజిలాండ్.. బజ్‌బాల్ రుచి చూపిస్తూ ప్రతీకార విజయం

Cricket World Cup  2023: ఇంగ్లాండ్‌ని చితకొట్టిన న్యూజిలాండ్.. బజ్‌బాల్ రుచి చూపిస్తూ ప్రతీకార విజయం

2019 వరల్డ్ కప్ ఫైనల్లో తుది  మెట్టుపై బోల్తా పడి దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్ చేతిలో ఓడిన న్యూజిలాండ్.. నాలుగేళ్ల తర్వాత భారత గడ్డపై వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై ప్రతీకార విజయం తీర్చుకుంది. అప్పుడు ఇంగ్లాండ్ కి అదృష్టవశాత్తు విజయం లభిస్తే ఇప్పుడుకివీస్ మాత్రం భారీ విక్టరీ నమోదు చేసింది. 

వరల్డ్ కప్ తొలి మ్యాచులో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్  తొలుత ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్ కే నమోదు చేస్తూ 282 పరుగులకు పరిమితం చేసింది. ఇంగ్లాండ్ జట్టులో రూట్ 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రికి 3 వికెట్లు, సాంట్నర్, ఫిలిప్స్ కి చెరో రెండు వికెట్లు లభించాయి. 

     
ఇక లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా.. ఓపెనర్ కాన్వె, రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగారు. మొదటి నుంచి ధాటిగా బ్యాటింగ్ చేత్తో ఇంగ్లాండ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.