భద్రాచలం, వెలుగు : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కుక్, కామాటీలకు గురువారం పీవో రాహుల్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఇచ్చారు. డీడీ మణెమ్మ, డీప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్, ఏటీడీవోల పర్యవేక్షణలో మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాలు, టిఫిన్ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
వంటశాలను శుభ్రంగా ఉంచుకోవడం, తాగునీరు, క్రిమి కీటకాల నిర్మూలన, శానిటేషన్, ఆహార పదార్థాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించారు. బియ్యం, కూరగాయలు, వాటిల్లో వాడే పదార్థాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత ఆయా వార్డెన్లు, టీచర్లు తీసుకోవాలన్నారు.