కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ షాకిచ్చింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రం నిత్యావరసరాల ధరలు పెంచుతూ ప్రజలపై మరింత భారం పెంచుతోంది. వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో వినియో గదారు ల భారం పడుతోంది. అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్ పై ఒక్కసారగా రూ. 15 నుంచి 20 లు పెరిగాయి.
పామాయిల్ రూ. 100 నుంచి రూ.130-రూ. 140 , వేరు శనక నూనె రూ. 155 నుంచి రూ. 165 కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ రూ.110 నుంచి రూ. 120 కి పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు.