Coolie movie release date: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజనీకాంత్ యాక్షన్ సినిమా..

Coolie movie release date: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజనీకాంత్ యాక్షన్ సినిమా..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajijnikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ(Coolie). స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్(Loeksh kangaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 

►ALSO READ | HIT 3 OTT Rights: ఇదెక్కడి మాస్ రా మావ.. రిలీజ్ కి ముందే రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన నాని సినిమా..

శుక్రవారం కూలీ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. ఇందులోభాగంగా ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయానికి సంబందించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో రజినీకాంత్ విజిల్ కొడుతూ పవర్ఫుల్ సీరియస్ లుక్ లో కనిపించాడు. యాక్షన్ డ్రామా సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తదితరులు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రల్లో నటిస్తున్నారు.