కూలింగ్​ సొల్యూషన్స్ కంపెనీ ఐస్​మేక్​లాభం రూ.2.81 కోట్లు

కూలింగ్​ సొల్యూషన్స్ కంపెనీ ఐస్​మేక్​లాభం రూ.2.81 కోట్లు

న్యూఢిల్లీ: కూలింగ్​ సొల్యూషన్స్ ​అందించే హైదరాబాద్​ కంపెనీ ఐస్​ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ​ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం 39శాతం మెరుగుపడి రూ.2.81 కోట్లకు చేరుకుంది.  

కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం ఏడాది లెక్కన 34శాతం పెరిగి రూ.110.56 కోట్ల కు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.110.77 కోట్లకు పెరిగింది. ఇబిటా ఏడాది లెక్కన 56శాతం పెరిగి రూ.6.89 కోట్లకు, పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ.3.59 కోట్లకు పెరిగాయి.   ఈ క్వార్టర్​లో ఈపీఎస్​ రూ.1.82లకు పెరిగింది.