
ఎండాకాలంలో శరీరంలోని వేడిని తరిమికొట్టి చల్లగా ఉండాలంటే సబ్జాగింజలు కావాలి. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వాళ్లకీ బెస్ట్ ఆప్షన్స్ ఇవి. ఇన్ని ప్రయోజనాలున్న సబ్జా గింజల్ని డిఫరెంట్ గా వండుకుని రుచిచూస్తే కమ్మటి రుచితో పాటు శరీరాన్ని చల్లగా ఉంచొచ్చు
ఫ్రిటాటా
కావాల్సినవి:
- కోడిగుడ్డు : నాలుగు
- నూనె : రెండు టేబుల్ స్పూన్లు
- సబ్జా గింజలు : రెండు టేబుల్ స్పూను
- పాలకూర తరుగు : ఒక కప్పు
- టొమాటో తరుగు : ఒక కప్పు
- ఉప్పు: తగినంత
- మిరియాల పొడి : తగినంత
- ఉల్లిగడ్డ తరుగు : ఒక కప్పు
- పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్
- చీజ్ కొద్దిగా
- వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు
- చాట్ మసాలా : చిటికెడు
ఇలా చేయాలి : గిన్నెలో ఉల్లిగడ్డ టొమాటో.. పచ్చిమిర్చి తరుగు, సబ్జా గింజలు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి పేస్ట్, పాలకూర.. ఉప్పు, కోడిగుడ్డు సొన కూడా వేసి బాగా కలపాలి. అ తర్వాత పాన్ లో నూనె వేడిచేసి కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి రెండు వైపులా కాల్చాలి..
బటర్ మిల్క్
కావాల్సినవి:
- పెరుగు : ఒక కప్పు
- సబ్జా గింజలు : ఒక కప్పు
- అల్లం తరుగు : అర టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు : ఒక టీ స్పూన్
- కొత్తిమీర తరుగు : ఒక టీ స్పూన్
- ఉప్పు : తగినంత
- జీలకర్ర పొడి : అర టీ స్పూన్
ఇలా చేయాలి : మిక్సీ జార్లో పెరుగు, అల్లం పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పుం వేసి మిక్సీ పట్టాలి. మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల నీళ్లు కలపాలి. తర్వాత అందులో. నానబెట్టిన సబ్జా గింజలు కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలిపాలి. చివరగా నిమ్మకాయ పిండి. కలపాలి. ఈ మజ్జిగను గ్లాసులో నింపుకుని తాగితే చల్లగా, టేస్టీగా ఉంటుంది
పాయసం
కావాల్సినవి :
- బాదం పాలు : ఒక కప్పు
- పాలు : ఒక కప్పు
- తేనె : ఒక టేబుల్ స్పూన్
- సబ్జా గింజలు : అర కప్పు
- యాపిల్ ముక్కలు : ఒక టేబుల్ స్పూన్
- ప్రెష్ క్రీం : ఒక టేబుల్ స్పూన్
- బాదం : ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి : రెండు టేబుల్ స్పూను
- కిస్మిస్ : ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు : ఒక టేబుల్ స్పూన్
- సగ్గుబియ్యం : అర కప్పు
- దానిమ్మ గింబలు : ఒక కప్పు
ఇలా చేయాలి : పాన్ లో నెయ్యి వేడిచేసి కిస్మిస్, వాదం, జీడిపప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత భారం పాలు, పాలు పోసి మరిగించాలి అందులో సగ్గుబియ్యం వేసి ఇంకాసేపు ఉడికించాలి. ఆ మిశ్రమంలో సబ్జాగింజలు తేనె, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఫ్రెష్ క్రీం కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి అంతే యమ్మీ అండ్ హెల్దీ సబ్జాగింజల పాయసం రెడీ.
స్మూతీ
కావాల్సినవి :
- అరటి పండు : ఒకటి
- ఓట్స్ : రెండు టేబుల్ స్పూన్లు
- సబ్జా గింజలు : ఒక టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క పొడి : కొద్దిగా
- పెరుగు : పావు కప్పు
- తేనె : ఒక టేబుల్ స్పూన్
- పాలు : ముప్పావు కప్పు
- పుదీనా : కొద్దిగా
ఇలా చేయాలి : అరటి పండు, ఓట్స్, సధా గింజలు, దాల్చినచెక్క, పెరుగు, తేనె, పాలు అన్నింటిని మిక్సీలో వేసి, మెత్తగా పట్టాలి. దాన్ని కాసేపు ఫ్రిజ్లోలో పెట్టి, చల్లగా ఆయ్యాక గ్లాసుల్లో పోసి, పుదీనాతో గార్నిష్ చేయాలి. దీన్ని పాయసంలా స్పూన్ తో తినొచ్చు. లేకపోతే స్ట్రాటోతాగొచ్చు.