- పెట్రోల్ పంపులు, రైసు మిల్లుల ఏర్పాటుకు ప్లాన్
- నిర్మల్ జిల్లాలో 8 మండలాల ఎ౦పిక
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఇప్పటికే రైతులకు సంబంధించిన ఎరువులు, విత్తనాలను కొన్ని సంఘాలు విక్రయిస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయేతర వ్యాపార రంగంలోకి కూడా ఇవి ప్రవేశించబోతున్నాయి. దీనికి సంబంధించి నిర్మల్‌జిల్లా సహకారశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో 17 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 49,680 మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల ఈ సంఘాలు ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నాయి. వ్యవసాయేతర వ్యాపారంలో సహకార సంఘాలకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో పెట్రోల్ బంకులు, రైసు మిల్లుల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించారు. దీనికి సంబంధించి జిల్లా సహకార శాఖ ప్రతిపాదన రూపొందించింది.
నిర్మల్ జిల్లాలోని నాలుగుచోట్ల పెట్రోల్ బంకులు, నాలుగు చోట్ల రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, వేములవాడలో ఇలా సహకార సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లుల నిర్వహణను పరిశీలించిన జిల్లా సహకార అధికారులు ఇదే విధానాన్ని నిర్మల్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ సబ్సిడీ పథకాల పరిధిలోకి ఈ వ్యాపారాలను తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల నిర్వహణ కోసం ఆయిల్ కార్పొరేషన్ అందించే సబ్సిడీని వినియోగించుకోనున్నారు. అలాగే నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ద్వారా అందే సబ్సిడీ నిధులను రైస్‌మిల్లుల ఏర్పాటుకు వినియోగించుకోవాలని సహకార శాఖ అధికారులు భావిస్తున్నారు. వాటి నిర్వహణను సైతం సహకార సంఘాల సభ్యులకు మాత్రమే అప్పజెప్పబోతున్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతు సహకార సంఘాలు సమష్టిగా వీటి నిర్వహణను చేపట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చూడనున్నారు.
నాలుగు పెట్రోల్ బంకులు…
నిర్మల్ జిల్లాలో నాలుగు చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. కడెం మండలంలోని పాండ్వాపూర్,పె౦బి, కుభీర్, తానూర్ మండల కేంద్రాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పెట్రోల్ బంకులను సహకార సంఘాల సభ్యులు ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఈ బంకుల్లో పెట్రోలు వినియోగించుకునేవారు పది రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. శాశ్వత సభ్యత్వ రుసుంగా రూ. 300 ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు రూ.16 లక్షలు అవసరమవుతాయి. ఇందులో నుంచి ఆయిల్ కార్పొరేషన్లు సబ్సిడీ రూపంలో రూ. ఆరు లక్షలు అందించనున్నాయి. రూ. పది లక్షలు ఆయా సహకార సంఘాలు భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ సహకారం కూడా తీసుకోనున్నారు. ఈ నాలుగు చోట్ల పెట్రోల్ బంకుల నిర్వహణ విజయవంతమైనట్లయితే మరికొన్ని సొసైటీల పరిధిలో కూడా పెట్రోల్ బంకులను నిర్వహించే దిశగా ప్రణాళికలు
రూపొందించనున్నారు .
ఎన్సీడీసీ సహకారంతో రైస్ మిల్లులు
జిల్లాలోని ముధోల్, లోకేశ్వరం, ఆలూరు, కడెం మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెం ట్ కార్పొరే షన్(ఎన్ సీడీసీ) సహకారంతో ఈ
రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నారు. ఒకో మిల్లు ఏర్పాటుకు రూ. 50 లక్షలు వ్యయం కానున్నట్లు ప్రతిపాదనలు రూపొందిం చారు. ఇందులో రూ. 20 లక్షలు సబ్సిడీ ఉంటుం ది. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైస్ మిల్లు ఏర్పాటుకు
మూడెకరాల స్థలం ఇవ్వాల్సి ఉంటుంది.