సహకార సంఘాల గడువు మరో 6 నెలలు పొడిగింపు

సహకార సంఘాల గడువు మరో 6 నెలలు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక సహకార సంఘాల​సభ్యుల పదవీకాలాన్ని మరో 6 నెలలు  పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సహకారశాఖ కమిషనర్​ జీవో రిలీజ్ చేశారు.  రాష్ట్రంలోని 904 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి.

 శుక్రవారానికి ఒక్క సంగెం ప్యాక్స్​ మినహా అన్ని ప్యాక్స్​సభ్యుల పదవీకాలం ముగిసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 9 డీసీసీబీ పదవీకాలం కూడా ఈ నెల 24న ముగుస్తున్నది. అంతేగాక, టీజీకాబ్​ కమిటీ సభ్యుల పదవీకాలం మార్చి 4తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరో 6నెలల పాటు కానీ.. లేదా అప్పటిలోగా ప్రభుత్వం నిర్ణయం మేరకు కానీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.