ఎన్టీఆర్ హయాం నుంచి సహకార సంఘాలు బలోపేతమయ్యాయి : స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి

బాన్సువాడ, వెలుగు: ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సహకార సంఘాలు బలోపేతమయ్యాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్​జితేశ్​వీ పాటిల్​తో కలిసి పాత బాన్సువాడలో కోపరేటీవ్ ​సొసైటీ కొత్త బిల్డింగ్​ని, గోదామ్​లను ప్రారంభించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ..1977 లో తన రాజకీయ జీవితం దేశాయ్​పేట సొసైటీ చైర్మన్ గా ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఏకగవాక్ష విధానం (సింగిల్ విండో) ద్వారా రైతులకు ఒకే ప్రదేశంలో అన్నీ రకాల సేవలను అందుతున్నాయన్నారు. బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి సొసైటీని జిల్లాలో నెంబర్​వన్​స్థానంలో నిలిపారని కొనియాడారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జడ్పీటీసీ పద్మ, ఎంపీపీ నీరజ తదితరులు పాల్గొన్నారు.