సిద్దిపేట టౌన్, వెలుగు: జిల్లాలో డ్రగ్స్నిషేధంపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీసులు నిఘా పెట్టాలన్నారు.
సోషల్ మీడియాలో డ్రగ్స్ అవేర్నెస్ వీడియోలు, ఫొటోలతో ప్రచారం చేయాలని సూచించారు. నిత్యం రోడ్లపై డ్రంకెన్డ్రైవ్టెస్టులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈఈ మనోహర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస మూర్తి, ఏసీపీ మధు, జిల్లా వైద్యాధికారి పల్వన్ కుమార్ పాల్గొన్నారు.