
సంగారెడ్డి టౌన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయా జిల్లా ఎస్పీలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఐజీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రూపేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవడం వల్ల నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. అక్రమ నగదు, మద్యం నియంత్రణకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు అంశాలపై ఎస్పీలతో కో ఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.