ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. కరౌలీ ప్రాంతంలో. ఈ నెల 2న ఉగాది సందర్భంగా కొందరు వ్యక్తులు కరౌలీలో టూ వీలర్స్‌పై ర్యాలీ నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో కొందరు షాప్‌లు, వాహనాలకు నిప్పు పెట్టడంతో ఈ ప్రదేశమంతా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒక చిన్నారి కుటుంబం చిక్కుకుంది. ఆ చిన్నారి ఇంటికి రెండు వైపులా ఉన్న షాపులకు మంటలు అంటుకున్నాయి. ఆ ఇంట్లో ఉన్న మహిళలు సాయం కోసం చూస్తున్నారు. ఆ సమయలో అక్కడ డ్యూటీలో ఉన్న నేత్రేశ్ శర్మ అనే కానిస్టేబుల్, వాళ్లను గమనించి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వెంటనే చిన్నారిని ఎత్తుకుని, వాళ్లను కూడా తనవెంటే రమ్మని చెప్పాడు. అలా మంటల మధ్యే వెళ్లి చిన్నారిని, మహిళల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. నేత్రేశ్ శర్మ చిన్నారిని బయటకు తీసుకొస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నేత్రేశ్ శర్మ సాహసాన్ని పోలీసు అధికారులు సహా అందరూ ప్రశంసిస్తున్నారు.
Liberal Media who were hailing Muskan Khan 24×7 are SILENT today when a brave constable of Rajasthan Police saves a hindu child from muzlims mob v!olence at #Karauli pic.twitter.com/E9J0KB2Krx
— Dr. Mahesh Joshi (@MaheshJoshi_MJ) April 4, 2022