సైలెన్సర్లు మారిస్తే చర్యలు తప్పవు..263 సైలెన్సర్లు ధ్వంసం

సైలెన్సర్లు మారిస్తే చర్యలు తప్పవు..263 సైలెన్సర్లు ధ్వంసం

కాజీపేట, వెలుగు : సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండలోని అదాలత్ లో రోడ్డుపై వివిధ బైక్ లకు మార్పు చేసిన 263 సైలెన్సర్లను తొలగించి

ఒకే దగ్గర రోడ్డుపై పెట్టి రోడ్డురోలర్ తో ధ్వంసం చేయించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్లు రామకృష్ణ, సీతారెడ్డి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.