మహేష్ బ్యాంకు కేసులో విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్ హుస్సేని ఆలంకు చెందిన వినోద్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హిందూస్తాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంకులో వినోద్ అకౌంట్ తెరిచినట్లు గుర్తించారు. వినోద్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు మళ్లించారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు సర్వర్‌లో ఆధారాలను తొలగించారు కేటుగాళ్లు. బ్యాంకు సర్వర్లను 18 గంటల పాటు తమ ఆధీనంలో పెట్టుకున్నారు నేరగాళ్లు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న..ఫోన్ నెంబర్ల వివరాలను కూడా మాయం చేశారు.
దీంతో సర్వర్‌ను హ్యాక్ చేసిన వ్యక్తి ఎవరనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. గతంలోనూ కూడా 2 బ్యాంకుల సర్వర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. రెండు బ్యాంకులతో పాటు మహేష్ బ్యాంకుకు ఒకే సంస్థ సాఫ్ట్‌వేర్ అందించినట్లు పోలీసులు గుర్తించారు.
బ్యాంకుల హ్యాకింగ్‌లో సారూప్యత ఉండటంతో ఒక్కరే హ్యాక్ చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది మహేష్ బ్యాంకు కూకట్‌పల్లి శాఖలో ఖాతా తెరిచారు నిందితులు. సర్వర్ హ్యాక్ చేసి సంబంధిత ఖాతాలో రూ.50లక్షలు వేశారు నేరగాళ్లు. బషీర్‌బాగ్ శాఖలో సేవింగ్ ఖాతా తెరిచిన ముంబై మహిళ బషీర్‌బాగ్ శాఖలో తెరిచిన ఖాతాలోకి రూ.7కోట్లు బదిలీ అయ్యింది. దీంతో బ్యాంకులో ఖాతాలు తెరిచిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా హ్యాక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. మహేష్ బ్యాంకు నుంచి మొత్తం 128 ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో పలు బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
ఇవి కూడా చదవండి:
కరోనా సోకిన గర్భిణికి నార్మల్ డెలివరీ
రాష్ట్రంలో కోవిడ్ టెన్షన్.. గ్రేటర్‌లో పెరుగుతున్న కేసులు