అద్దె ఇంట్లో పోలీసుల సోదాలు.. గుట్టలు గుట్టలుగా రూ.500 నకిలీ నోట్ల కట్టలు..

అద్దె ఇంట్లో పోలీసుల సోదాలు.. గుట్టలు గుట్టలుగా రూ.500 నకిలీ నోట్ల కట్టలు..

ఓ అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.. గుట్టలు గుట్టలుగా రూ. 500 నకిలీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. గుట్టలు గుట్టలుగా నకిలీ నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు పోలీసులు. కర్ణాటకలోని దండేలిలో ఓ అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ఉన్నాయన్న సమాచారంతో సోదా నిర్వహించారు పోలీసులు. ఈ సోదాల్లో పెద్దఎత్తున నోట్ల కట్టలు గుర్తించారు పోలీసులు. అయితే.. ఆ నోట్ల మీద సీరియల్ నంబర్స్ కానీ.. ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ కానీ లేకపోవడంతో నకిలీ నోట్లుగా నిర్దారించారు పోలీసులు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లపై ఫర్ ఫిలిం షూటింగ్ పర్పస్ ఓన్లీ అని ఉండటం గమనార్హం. నకిలీ నోట్లతో పాటు కౌంటింగ్ మెషిన్ ని స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన పోలీసులు..ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా సదరు నోట్లపై రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉందని తెలిపారు పోలీసులు.

నకిలీ నోట్లు ఉన్న ఇంట్లో అద్దెకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మరి, ఆ ఇంట్లో దొరికిన నోట్లు నిజంగానే ఫిలిం షూటింగ్ పర్పస్ కోసం వాడుతున్నారా లేదా చలామణి కోసం వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.