హైదరాబాద్ పోలీసుల స్టోరీ వింటుంటే ఫన్నీగా ఉంది: సుశీల్ మోడీ

హైదరాబాద్ పోలీసుల స్టోరీ వింటుంటే ఫన్నీగా ఉంది: సుశీల్ మోడీ

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై హైదరాబాద్ పోలీసులు చెబుతున్న స్టోరీ వింటుంటే చాలా ఫన్నీగా ఉందని బీజేపీ నాయకుడు, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ అన్నారు. రేప్ చేసిన నిందితులను శిక్షించాలంటే చట్ట ప్రకారం అమలు చేయాలని అన్నారు. తమపై దాడి చేశారని, హెచ్చరించినా వినకపోవడం వల్లే కాల్పులు జరిపామన్న పోలీసుల మాటలు వింటుంటే నవ్వొస్తుందని అన్నారు. తాను ఇలాంటి ఎన్ కౌంటర్ లకు, మూకదాడులకు వ్యతిరేకమని ఆయన అన్నారు.

More News

ఈ ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించినోళ్లు దేశద్రోహులు
నేను ఈ తరహా ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం : ఒవైసీ
గర్భవతిగా ఉన్నా.. నా భర్త ఎన్ కౌంటర్ ను తట్టుకోలేను: చెన్నకేశవులు భార్య
నా కొడుకే కాదు..దేశంలో హత్యాచార నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయాలి: ఏ2 నిందితుడు జొల్లి శివ తండ్రి

“ప్రజలు ఈ ఎన్ కౌంటర్ ను ఓ పండుగలా జరుపుకుంటున్నారు. కానీ నిందితులను చట్టప్రకారం మాత్రమే శిక్షించాలి. ఈ ఘటనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని” సుశీల్ మోడీ అన్నారు.