
- జైపూర్ఎస్టీపీపీ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ, మహారాష్ర్ట పోలీస్ఆఫీసర్ల మీటింగ్
మంచిర్యాల, వెలుగు : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ, మహారాష్ర్ట సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్పవర్ప్లాంట్(ఎస్టీపీపీ) గెస్ట్‌హౌస్‌లో రెండు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు భేటీ అయ్యారు.
రామగుండం పోలీస్ కమిషనర్‌ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, జయశంకర్భూపాలపల్లి అడిషనల్ఎస్పీ (ఆపరేషన్స్) ఎన్.భుజంగరావు, కుమ్రంభీమ్ఆసిఫాబాద్జిల్లా అడిషనల్ఎస్పీ(అడ్మిన్) ఆర్.ప్రభాకర్‌రావు, మహారాష్ర్టలోని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్, అడిషనల్ఎస్పీ (ఆపరేషన్స్) యతీష్ దేశ్‌ముఖ్, అహేరి అడిషనల్ఎస్పీ ఎం.రమేశ్, బెజాపూర్ అడిషనల్ఎస్పీ వైభవ్ బ్యాంకర్, అడిషనల్ఎస్పీ(అడ్మిన్) చంద్రకాంత్ తదితరులు సమావేశమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు.
సరిహద్దు జిల్లాల పోలీస్అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని చర్చించారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయించారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌మాట్లాడుతూ రెండు రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో గ్రేహౌండ్స్ ఓఎస్డీ దయానంద్, సిరొంచ ఎస్డీవోపీ సందేశ్నాయక్, నిర్మల్ఎస్డీవోపీ ఎ.గంగారెడ్డి, కాగజ్నగర్ఎస్డీవోపీ ఎ.కరుణాకర్, రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, జైపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రకాశ్, రవికుమార్ పాల్గొన్నారు.