వెబ్ పేజీ, ఫొటోలు, మెసేజ్‌లను ఐ ఫోన్లో స్క్రీన్ షాట్ తీయడం ఇప్పుడు చాలా ఈజీ. స్క్రీన్‌షాట్ కోసం ఐఒఎస్ 16 వెర్షన్లో కాపీ, డిలీట్ అనే కొత్త ఫీచర్ తెచ్చింది యాపిల్. దాంతో ఫొటోల్ని యాప్‌లో స్టోర్ చేయకుండానే స్క్రీన్‌షాట్ తీయొచ్చు. అంతేకాదు ఆ ఫొటోలు ఫోన్లో సేవ్ కావు. దీనివల్ల స్పేస్ ఆదా అవుతుంది. స్క్రీన్‌షాట్ తీసిన ఫొటోల్ని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈజీగా పోస్ట్ చేయొచ్చు కూడా.
ఎలా తీయాలంటే..
స్ర్కీన్‌షాట్ తీయాలనుకున్న వెబ్‌పేజీ ఓపెన్ చేయాలి. వాల్యూమ్ బటన్, పవర్ బటన్ని ఒకేసారి నొక్కి పట్టుకోవాలి. స్ర్కీన్ కింద ఎడమవైపు పాప్–అప్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి, స్క్రీన్‌షాట్ ఎడిటర్‌లోకి వెళ్లాలి. అవసరమైన మార్పులు చేశాక పైన ఎడమవైపు ఉన్న ‘డన్’ బటన్ నొక్కాలి. సేవ్ టు ఫైల్, సేవ్ టు ఫొటోస్ ఆప్షన్లతో పాటు కాపీ, డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కాపీ, డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి.