పాలమూరు, వెలుగు: ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని మహబూబ్నగర్ అడిషనల్ ఎస్పీ రాములు తెలిపారు. ఆదివారం దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 బైక్ లు, 9 ఆటోలు, రెండు కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నేరాలను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. కాలనీల్లో కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
సైబర్ క్రైం నేరాల పట్ల అలర్ట్గా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు, ఈ మెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు. ఆన్లైన్ మోసం జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీ నాయక్, ఎస్సై విజయ్ కుమార్
పాల్గొన్నారు.