(Rainy Season)వర్షాకాలం మొదలైంది.. ఇక వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఉండే తినుబండారాలు పొట్టలో వేయాలనిపిస్తుంది. అలా అలా వేడి వేడిగా పకోడీలు.. బజ్జీలు తింటుంటే ఎంత హాయిగా, ఆహ్లాదంగా ఉంటుందో.. అంత హాయిగానే రోగాలు కూడా వస్తాయి. అంతేకాదు Rainy Season వర్షాలతో పాటు రోగాలను కూడా వెంట మోసుకొస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల ముప్పు సరే సరి.. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటి ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ తిన్నారా.. ఇక అంతే.. కాలేజీలకు.. ఆఫీసులకు కొన్ని రోజులు సెలవు చెప్పాల్సిందే.. అలాంటిదేమీ లేకుండా వర్షాకాలంలో హెల్తీఫుడ్.. ఎన్నో పోషకాలున్న .. పిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు అందరూ ఇష్టపడే ... ఎన్నో పోషకాలున్న మొక్కజొన్న కంకులు వేడి వేడిగా తిన్నారనుకోండి.. హాయికి హాయి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు ఉంటాయి. ఇంతకూ మొక్కజొన్న కంకులో ఎలాంటి పోషకాలున్నాయి.. వాటితో ఏఏ వ్యాధులను అరికట్టవచ్చో తెలుసుకుందాం. . . .
ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. ఈ రైనీ సీజన్ ని ఇష్టపడని వారు ఉండరు. చిరుజల్లులు, చల్లటి వాతావరణం మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో ఏదైనా రుచికరమైన స్నాక్స్ ఉంటే బాగున్ను అనిపిస్తుంది. వేడివేడి పకోడీ, మిర్చి, బజ్జి ఏదైనా స్పైసి ఐటమ్ తినాలని అనిపిస్తుంది. అయితే ఈ కాలం వర్షాలతో పాటు.. వ్యాధులను తన వెంట మోసుకొస్తుంది. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఆయిల్ ఫుడ్స్ తినడం అంత మంచిది కాదు. అయితే మంచి హెల్తీ ఐటెం వర్షాకాలంలో తినాలనుకుంటే మాత్రం.. మొక్కజొన్నకు మించింది లేదు.
సాయంత్రం పూట నోరు ఊరించేలా కనిపిస్తుంటాయి రకరకాల స్ట్రీట్ ఫుడ్స్. వాటి ఘుమ ఘుమల వాసనలు అటువైపు ఆకర్షిస్తాయి. తినకుండా అక్కడి నుంచి వెళ్ళనీయ కుండా చేస్తాయి. అలాంటి స్ట్రీట్ ఫుడ్ లలో మొక్కజొన్న కూడా ఉంది. ఈ మొక్కజొన్నకంకులు ఎందరికో ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్. ముఖ్యంగా వర్షాకాలం, చలి కాలంలో వీటిని తప్పకుండా తినాలనిపిస్తుంది. అయితే బయట తినడం కంటే ఇంట్లో మనకు నచ్చిన రీతిలో చేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది.
వర్షాకాలం రోడ్లపై బురద.. గాలికి దుమ్ము, ధూళి.. వర్షపు నీరు.. ఇలాంటివి తినే ఫుడ్ ఐటమ్స్ పై పడతాయి. వ్యాపారులు వాటిని అలానే బాయిల్ చేయడమో కాల్చి ఇచ్చే వాటిని కాల్చడమ చేసి ఇస్తారు. కాని ఇంట్లోనే తయారు చేసుకుని తింటే శుచి శుభ్రత ను పాటిస్తాం. మొక్కజొన్న తినడం వల్ల వర్షా కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కొంత వరకు ఉపశమనం కూడా కలుగుతుందని వైద్యులు చెపుతున్నారు. మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినచ్చు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చితే సాయంకాలం వేళ మంచి చిరుతిండి.
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీటికి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని వైద్యులు చెపుతున్నారు. ఇక పీచు పుష్కలంగా ఉండటంతో ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుందట. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుందని చెపుతున్నారు.
మొక్కజొన్న వల్ల ఏఏ ఉపయోగాలున్నాయంటే..
- మొక్కజొన్న పేగుకేన్సర్‌ను అరికడుతుందని.. ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.
- పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది.
- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి మొక్క జొన్నలు ఉపయోగపడతాయని వైద్యులు అంటున్నారు.
- మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు… శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయట.
- మరి ఇన్ని లాభాలున్న మొక్క జొన్న ను మీకూ తినాలనిపిస్తుందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి తెచ్చుకొని లాగించేయండి.