స్మార్ట్ టీవీలు రోజుకో టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న టీవీలు మొదలు 110 అంగుళల బిగ్ స్క్రీన్ల వరకు లేటెస్ట్ టెక్నాలజీతో, ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, టెక్నాలజీకి అప్ డేట్ తో పెద్ద స్క్రీన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వృత్తి, వ్యాపారపరంగా చాలామంది పెద్ద స్క్రీన్లను ఎంచుకుంటున్నారు.
ముఖ్యంగా ఆఫీసులు, విద్యాసంస్థల్లో ఎక్కువ కాలం ఉంటే బిగ్ స్క్రీన్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఇంటరాక్టివ్ డిస్ ప్లే టెక్నాలజీ ప్రొవైడర్ కార్నియా.. ఇప్పుడు భారత్ లో 100 అంగుళాల భారీ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ తో మన ముందుకు వస్తోంది.
భారత్ లో అతిపెద్ద ఇంటరాక్టివ్ డిస్ ప్లేగా వస్తున్న ఈ స్మార్ట్ టీవీ ప్యానెల్ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ తో ఆధారంగా పనిచేస్తుంది.
ఇది కో ప్రెజెంటేషన్స్ ఆధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.
ప్లాట్ ప్యానెల్ స్మార్ట్ ఆఫీస్ సిస్టమ్ కోసం రూపొందించబడింది.
ఇది వాయిస్ కంట్రోల్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది.
ఇందులో 4K అల్ట్రా HD డిస్ ప్లే, 8GB RAM, 128 GB స్టోరేజీ ఉంది.
డిస్ ప్లే డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఇది మంచితీరు, ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
డిస్ ప్లే ఎలా ఉంటుందంటే..
కార్నియా ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ తో వస్తుంది.
ఇది మంచి విజిబులిటీలో కార్పొరేట్, విద్యాపరమైన అవసరాల్లో వినియోగించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
అల్ట్రా HD రిజల్యూషన్, స్ట్రాంగ్ కలర్స్, ఎక్కువ కాంట్రాస్ట్ రేషియోతో అలా చూస్తుండి పోవాలనిపించే ఆకర్షణీయమైన విజిబులిటీని చూపిస్తుంది.
ఎక్కువగా ప్రెజెంటేషన్లు ఇచ్చే లేటెస్ట్ టచ్ స్క్రీన్ కార్నియా కలిగి ఉంటుంది.
ఇది ప్లాట్ ప్యానెల్ టీచర్స్, ఎక్స్ పర్ట్స్ తమ ఆలోచనలు పంచుకునేందుకు తద్వారా మంచి ఫలితాలకోసం ఇది గేమ్ ఛేంజర్ కాగలదని అంటున్నారు కార్నియా కంపెనీ ప్రతినిధులు.