- కరోనా నియంత్రణకు పబ్లిక్ ప్లేసుల్లో నిఘా
- అధికారులు, సిబ్బందికి బల్దియా ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్వేసేందుకు బల్దియా సిద్ధమైంది. కరోనా నియంత్రణలో భాగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గురువారం కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ సర్క్యూలర్ జారీ చేశారు. అడిషనల్ కమిషనర్లు, హెచ్వోడీలు, జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఆఫీసుతో పాటు, పబ్లిక్ ప్లేసెస్ లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కనీసం రెండు గజాల దూరాన్ని పాటించేలా చూడాలని సూచించారు. ఆఫీసులు, సెక్షన్లలో విజిటర్లను నియంత్రించాలని, ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు. లిఫ్ట్ ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలన్నారు. ఎమర్జెన్సీ మినహా ఫైళ్లన్నింటిని ఈ -ఆఫీస్ ద్వారానే పంపించాలన్నారు. ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలని ఆ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.