- పండుగలు వస్తున్నందున జాగ్రత్త
న్యూఢిల్లీ: కేరళలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ... దేశంలోని మొత్తం కేసులలో ఎక్కువ శాతం అక్కడే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని... రికవరీ రేట్ దాదాపు 98శాతంగా ఉందన్నారు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. దేశంలోని 18 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేట్ 5 నుంచి 10 శాతం నమోదు అవుతోందని ఆయన వివరించారు. పండగలు వస్తున్నందున... జాగ్రత్తగా ఉండాలని... జనం గుమిగూడొద్దని సూచించారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి డేటా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ఇచ్చినట్టు ఐసీఎంఆర్ ( ICMR) హెడ్ బలరాం భార్గవ తెలిపారు. ఈ డేటాను పరిశీలించి WHO నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.