రాష్ట్రంలో మరో 1498 కేసులు.. 6 మంది మృతి

రాష్ట్రంలో మరో 1498 కేసులు.. 6 మంది మృతి

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 14 వేల 735కి చేరాయి.  కరోనాతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1729కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 5323 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 313 మందికి కరోనా సోకింది.