న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,300 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడేనని తెలిపింది. ముగ్గురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,816కి పెరిగినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బాధితులు 4,46,99,418కి చేరారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేసుల పెరుగుదలకు కారణం ఇదేనా..!
మన దేశంలో ఇప్పటివరకు 349 కరోనా కొత్త వేరి యంట్ ఎక్స్-బీబీ1.16 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎక్స్-బీబీ1.16 కేసులు 105 నమోదు కాగా.. మన రాష్ట్రంలో 93, కర్నాటకలో 61, గుజ రాత్‌లో 54 కేసులు బయటపడ్డాయి. ఈ కొత్త వేరి యంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు డాక్టర్లు భావిస్తున్నారు. జనవరిలో మొదటిసారిగా ఎక్స్-బీబీ1.16 వేరియంట్‌కు సంబంధించి 2కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో 140 కేసు లు, మార్చిలో 207 ఎక్స్-బీబీ1.16 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.