తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1863 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 90,259 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 684కు చేరింది. కొత్తగా 1912 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 66,196గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,379 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 16,221 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73.34 శాతంగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది భారత రికవరీ రేటు 71.16 శాతం కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో శుక్రవారం 21,239 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 7,32,435కు చేరింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 394, మేడ్చల్ 175, రంగారెడ్డి 131, వరంగల్ అర్బన్ 101, సంగారెడ్డి 81, సిద్ధిపేట 60, కరీంనగర్ 104, ఖమ్మం 61, నిజామాబాద్ 63, గద్వాల 58, జగిత్యాల 61, నల్గొండ 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..