- గడచిన 24 గంటల్లో 10,057 కొత్త కేసులు.. 8 మంది మృతి
- రాష్ట్రంలో 44,935 యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 10వేలు దాటింది. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు కూడా 44,935 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1827 మందికి ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 1822 మందికి, అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 332 మందికి కరోనా నిర్ధారణ అయింది.
అలాగే కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది చనిపోయారు. విశాఖపట్టణం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు, యాక్టివ్ కేసుల వివరాలు ఈ కింది పట్టికలో చూడండి.
ఇవి కూడా చదవండి
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన
ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్
ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు