అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,01,462కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 72 మంది చనిపోగా..కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5177కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 88,197 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,08,088 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 10,712 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 48,84,371 శాంపిల్స్ పరీక్షించారు.
కాగా.. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1383, పశ్చిమ గోదావరి 1064, చిత్తూరు 905, ప్రకాశం 705, కడప 637, శ్రీకాకుళం 567, గుంటూరు 550, అనంతపురం 545, విజయనగరం 526, విశాఖ 449, కర్నూలు 394, కృష్ణా జిల్లాలో 367 కొత్త కేసులు నమోదయ్యాయి.