వరంగల్ NITలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులు.. ఫ్యాకల్టీ కరోనా బారినపడ్డారు. నిట్‌లో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాలుగురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దాంతో ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. వీరిలో నలుగురు విద్యార్థులు, ఫ్యాకల్టీలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ నెల 16వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. అప్పటివరకు ఆన్లైన్ క్లాస్‌లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు క్యాంపస్‌లో ఉండే ఉద్యోగులందరికీ పరీక్షలు చేయనున్నారు.
For More News..