ఏపీలో 525కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 525కు చేరిన కరోనా కేసులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రానికి కొత్త‌గా మ‌రో 23 మందికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 525కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇవాళ ముగ్గ‌రు క‌రోనాకు బ‌ల‌య్యారు. నెల్లూరులో 56 ఏళ్ల వృద్ధుడు, క‌ర్నూలులో 76 ఏళ్ల డాక్ట‌ర్, విజ‌య‌వాడ‌లో 74 ఏళ్ల మ‌హిళ మ‌ర‌ణించారు. దీంతో మొత్తం కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 14కు చేరింది. అలాగే విశాఖ‌ప‌ట్నంలో బుధ‌వారం న‌లుగురు డిశ్చార్జ్ కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది క‌రోనా నుంచి కోల‌కుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 491 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా గుంటూరులో అత్య‌ధికంగా 122 మంది, కర్నూలులో 110, నెల్లూరు 58, కృష్ణా జిల్లాలో 45, ప్రకాశంలో 42 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. క‌డ‌ప జిల్లాలో 36, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 31, చిత్తూరులో 23, అనంత‌పురంలో 21, విశాఖ‌లో 20, తూర్పు గోదావ‌రిలో 17 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో క‌రోనా కేసులు జీరోగా ఉండ‌డం కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది.