ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,771 శాంపిల్స్ పరీక్షించగా.. 13,474 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 2031 మందికి, కర్నూలులో 1835 మందికి, విశాఖపట్నంలో 1349 మందికి, గుంటూరులో 1342 మందికి, ప్రకాశం జిల్లాలో 1259 మందికి, ఈస్ట్ గోదావరిలో 1,066 మందికి, నెల్లూరు జిల్లాలో 1007 మందికి గడిచిన 24 గంటల్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పన మరణించగా.. ఈ ఒక్క రోజులో మొత్తం తొమ్మిది మంది కరోనాకు బలయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే గడిచిన 24 గంటల్లో 10,290 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 1,09,493 మంది చికిత్స పొందుతున్నారని వివరించింది.
#COVIDUpdates: 27/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 27, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్ కేసు లకు గాను
*21,09,080 మంది డిశ్చార్జ్ కాగా
*14,579 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,09,493#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eFExZsBc9d
కాగా, ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా చేసిన టెస్టులు సంఖ్య మూడు కోట్ల 23 లక్షల 25 వేల 140 అని, నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 22 లక్షల 36 వేల 47 అని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. మొత్తం 14,579 మంది మరణించగా.. 21 లక్షల 11 వేల 975 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొంది.