నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. డైలీ 10కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాగర్‌లో ఉపఎన్నిక ఉండటంతో ఆయా పార్టీల లీడర్లు, కార్యకర్తలు అక్కడ భారీగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం పార్టీ ప్రచారాలలో పార్టీల నేతలు, కార్యకర్తలు వేలాదీ మంది పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రచారంలో పాల్గొనే వారందరూ కరోనా రూల్స్ బ్రేక్ చేస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయంటున్నారు. కరోనా టెస్టులు చేస్తే వందల సంఖ్యలో కేసులు బయటపడే ఛాన్స్ ఉందని వైద్యులు అంటున్నారు. ప్రచారానికి ఆటంకం కలుగుతుందని అధికారులు కరోనా పాజిటివ్ కేసుల వివరాలు బయట పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హాలియా మండలంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కమల నెహ్రు ఏరియా హాస్పిటల్ సూపెరిండేంట్ భాను ప్రసాద్ అంటున్నారు. ‘ప్రతి ఏరియా హాస్పిటల్‌లో గత నెల మూడో వారం నుంచి కేసులు పెరిగాయి. ప్రజలు మాస్క్‌లు పెట్టుకోకుండా.. విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఈ మద్యే వాక్సిన్ తీసుకున్న కమల నెహ్రు ఏరియా హాస్పిటల్ హరికృష్ణకు మళ్లీ పాజిటివ్ వచ్చింది. సాగర్ నియోజకవర్గంలో డైలీ కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ రివ్యూ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలతోనే కేసులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన లీడర్లు, కార్యకర్తలు నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడం వల్ల కరోనా సోకుతున్నట్లు భావిస్తున్నాం’ అని ఆయన అంటున్నారు.