ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు,చిత్తూరులో 607, కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 20,84,984కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,60,360 మంది కోలుకోగా... 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

మరిన్ని వార్తల కోసం..

ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా