మళ్లీ కరోనా టెర్రర్​

మళ్లీ కరోనా టెర్రర్​
  • భారీగా పెరుగుతున్న కరోనా డైలీ కేసులు
  • కొత్తగా 1,17,100 మందికి వైరస్ 
  • 3,007కు చేరిన ఒమిక్రాన్ బాధితులు 
  • లక్ష దాటిన డైలీ కేసులు.. 8 రోజుల్లోనే పదింతలు
  • నెలాఖరులో రోజూ 4 లక్షల కేసులు రావొచ్చు: ఎక్స్ పర్ట్స్

కరోనా మహమ్మారి మళ్లీ కమ్ముకొస్తోంది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నయి. దేశంలో డైలీ కేసులు గత 8 రోజుల్లోనే ఏకంగా పది రెట్లు పెరిగినయ్. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 1,17,100 మందికి వైరస్ అంటింది. డైలీ కేసులు మహారాష్ట్రలో 40 వేలు, వెస్ట్ బెంగాల్ లో 18 వేలు దాటినయ్. ముంబైలో వరుసగా రెండో రోజు 20 వేలు, ఢిల్లీలో 17 వేలకుపైనే నమోదైనయ్. మరో పది రోజుల్లోనే ఈ సిటీల్లో రోజూ 50 వేల కేసులు నమోదవు తాయని చెప్తున్నరు. దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ షురూ కాగా.. ఈ నెలాఖరు కల్లా పీక్ స్టేజీకి చేరే సూచనలు కన్పిస్తున్నయి. ఇదే జరిగితే.. రోజూ 4 లక్షల నుంచి 8 లక్షల మందికి వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కమ్ముకొస్తోంది. రోజును మించి రోజు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే డైలీ కేసులు 10 వేల నుంచి లక్ష మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,17,100 మందికి వైరస్ కన్ఫమ్ అయిందని శుక్రవారం ఉదయం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గత 214 రోజుల్లో ఇవే హయ్యెస్ట్ డైలీ కేసులని తెలిపింది. ఇక కొత్తగా మరో 377 మందికి ఒమిక్రాన్ సోకింది. మొత్తం కరోనా కేసులు 3,52,26,386కు, కొత్త వేరియంట్ కేసులు 3,007కు చేరాయి. వైరస్ బారిన పడి మరో 302 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,83,178కి పెరిగింది.  ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్నాటకలో 333, రాజస్థాన్​లో 291, కేరళలో 284 నమోదయ్యాయి. ఇప్పటివరకూ 1,199 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు 85,962కి పెరిగాయని కేంద్రం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 7.74కు పెరగగా, రికవరీ రేటు 97.57కు తగ్గినట్లు వివరించింది.  

ఇటలీ నుంచి వచ్చిన మరో 173 మందికి కరోనా
చండీగఢ్‌‌: ఇటలీ నుంచి మనదేశానికి వచ్చిన మరో ఫ్లైట్‌‌లో 173 మందికి కరోనా పాజిటివ్‌‌ వచ్చింది. మొత్తం 285 మంది ప్రయాణికులతో ఇటలీలోని రోమ్‌‌ నగరం నుంచి పంజాబ్‌‌లోని అమృత్‌‌సర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు ఓ విమానం శుక్రవారం వచ్చింది. కేంద్ర గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం అందులోని ప్యాసింజర్లకు కరోనా టెస్ట్‌‌ చేయగా, 173 మందికి పాజిటివ్‌‌ వచ్చింది. కాగా, గురువారం కూడా ఇటలీలోని మిలాన్‌‌ సిటీ నుంచి అమృత్‌‌సర్‌‌‌‌ వచ్చిన ఫ్లైట్‌‌లో కూడా 125 మంది వైరస్‌‌ బారిన పడ్డారు. వారందరినీ ఐసోలేషన్‌‌లో ఉంచి ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నారు.

ఒమిక్రాన్​ ప్రాణాంతకమే
ఒమిక్రాన్​ను తేలిగ్గా తీసిపారేయలేం. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంటే. ఒమిక్రాన్​ బాధితులూ ఆస్పత్రిలో చేరుతున్నరు. ప్రాణాలు కోల్పోతున్నరు. డెల్టా కంటే ఎక్కువ వేగంతో వ్యాపిస్తోంది. చాలా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రానే చివరి 
వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఇప్పుడే చెప్పలేం. భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్లు వస్తాయో ఊహించలేం. 
- డబ్ల్యూహెచ్ వో వార్నింగ్​