రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులగా 3 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అటు పొలిటికల్ నేతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీ తగ్గింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఆఫీస్ కు తాళం వేశారు. కరోనా కట్టడిలో భాగంగా ఏమైనా మీటింగ్స్ ఉన్నా...జూమ్ ద్వారా నిర్వహిస్తున్నారు. అటు TRS భవన్ కు కూడా కొత్తవారిని రానివ్వటం లేదు. కాంగ్రెస్ గాంధీభవన్ లో మాత్రం అడపదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలకు కరోనా సోకి ఐమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. మరోవైపు BRK భవన్ లో వరుసగా అధికారులు కరోనా బారిన పడుతుండటంతో... రోజు వచ్చే ఆఫీసర్ల సంఖ్య కూడా తగ్గింది. చాలా వరకు సచివాలయ అధికారులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించినా... టెస్టులు చేయించుకుంటున్నారు. అటు GHMC ఆఫీసులో పలువురికి కరోనా సోకడంతో.. ఆఫీసుకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు 670 మంది GHMC సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చాలా సెంటర్స్ లో దాదాపు 30 శాతంపైగా పాజిటివిటీ రేట్ వస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ చిందులు
ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు